Thursday, January 8, 2015

1. hariki lamkini hamtaku

Audio sample :

Ragam: Hamsadwani

l

2.nivu galigina chalu


Ragam: karjamu

3. Madavikaaramulu manevo - మదవికారములు మానేవో,

Sample Audio :


మదవికారములు మానేవో, నా
యెదురనె నీవు నేడింకాఁజేసేవో

నందవ్రజములోన నాడు నీవు గొల్ల
మందల మగువల మరగించీనా 
మందులు మాయలు మఱచితివో, యిప్పు 
డిందూ నామీద నింకాఁ జేసేవో

నలినాప్తకులుడవైనాడు నీవు ఇంతిం
గలకాలమెల్ల నంగడిబెట్టినా
మలినపు మాటలు మఱచితివో నన్ను
నెలయించి కాకల నింకా నేసేవో(నేపేవొ?)

నరసింహుడవై నాడు నీవు పెక్కు 
మురిపెంపు వికారములఁబోయినా
తిరువేంకటేశ పొందితివి నన్ను నీ
యిరవైన యీ చేత లింకాఁ జేసేవో

4.tAmu deliyaru taga jeppina vinaru

Sample Audio:

Ragam sama

5.tAnEDO manasEDO

Sample Audio:

ragam : Rageswari , 

6.YogibhOgi naTanam kuru

Sample Audio 

Ragam: Mohana

7.karmamaMTA mAku - కర్మమంటా మాకు మాయ కప్పేవు గాక

Sample Audio:

ragam : revati

8.timmireddy makunichche - తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము

Sample Audio

Ragam : Arabhi
తిమ్మిరెడ్డి మాకునిచ్చె దిష్టమైన పొలము
బొమ్మిరెడ్డి కప్పగించి పోదిసేసెఁ బొలము

నిండినట్టిమడుగుల నీరువంకపొలము
కొండలుమోచిన పెద్దగొబ్బరపుఁబొలము
అండనే పొలమురాజులుండేటి పొలము
చెండివేసి మాకులెల్లా సెలగిన పొలము

ఆసపడి వరదానమడిగిన పొలము
బాసలతోఁ గడు నెత్రుపట్టమైనపొలము
రాసికెక్కే మునులకు రచ్చైనపొలము
వేసరక నాగేట వేగిలైన పొలము

మంచి గురుతైన రావిమేనిచేనిపొలము
వంచిన గుఱ్ఱముఁ దోలే వయ్యాళి పొలము
యెంచగ శ్రీవేంకటేశు నిరవైన పొలము
పంచుకొని లోకులెల్లా బ్రదికేటిపొలము

9.ArtuDa nEnu - ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు

Sample Audio + Lavokkntayu ledu bhagavata padyam 
https://archive.org/details/ArtudaNenuShubhapantuvarali-lavokkintayu

ragam : Subhapantuvarali
ఆర్తుడనేను నీ కడ్డ మెందును లేదు
మూర్తి త్రయాత్మక మొగి కరుణించవే

సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు
సర్వసర్వం సహా చక్రవర్తి
నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి
సర్వాపరాధములు క్షమియింపవే

పరమాత్ముడవు నీవు పరంజ్యోతివి నీవు 
పరమ పరానంద పరమపురుషా
కరిరాజవరదా కారుణ్యనిలయా
శరణాగతుడ నన్ను సరిఁ గావవే

అణువులోపలి నీవు ఆదిమహత్తును నీవు
ప్రణుత శ్రీవేంకటప్రచురనిలయా
అణిమాదివిభవా ఆద్యంతరహితా
గణుతించి నాపాలఁ గలుగవే నీవు